బతుకమ్మ, జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ, మండల యువజన కాంగ్రెస్ పదవుల కోసం ఆన్లైన్లో సిస్టంలో ఎన్నికలను నిర్వహించడం జరిగింది.. జుక్కల్ మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా లాడేగావ్ గ్రామానికి చెందిన సతీష్ పటేల్ ఎన్నిక కావడంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు సతీష్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శాలువాతో ఘనంగా సత్కరించారు. జుక్కల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు నిరంతరం కృషి చేయాలన్నారు.. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి కట్టుబడి ఉంది. ప్రజాసేవకు చేస్తానని అలాగే మా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తానని తెలిపారు.