31 C
Hyderabad

సరస్వతీ విద్యా మందిర్ లో సంక్రాంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూరు, బతుకమ్మ : ఆర్మూరు పట్టణ కేంద్రం లోని టీచర్స్ కాలనిలో గల శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు .విద్యార్థిని, విద్యార్థులు అందరూ సాంప్రదాయ దుస్తులలో  విద్యార్థినిలు రంగవల్లులు వేశారు.  పాఠశాల ప్రిన్సిపల్ వినోద్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ విశిష్టతను తెలుపుతూ కైట్స్ ఎగురేసే టపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ,సూచనలు చేశారు..విద్యార్థులు వేసిన రంగవల్లులను పాఠశాల మేనేజ్మెంట్ భానుతేజ్,  ప్రిన్సిపల్ వినోద్ కుమార్ పరిశీలన చేసి మొదటి అయిదు బహుమతులను ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ భానుతేజ్, ప్రిన్సిపల్ వినోద్ కుమార్, మాతాజీలు సోనాలి, ,శైలజ ,మంజుల ,లత ,సింధుజ ,వేద ,ప్రియాంక, వనిత ,లతిక తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article