27.2 C
Hyderabad

ఆర్వోబీల పెండింగ్ బిల్లులు మంజూరు చేయండి

Must read

📰 Generate e-Paper Clip

  • ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కోరిన ఎంపీ అర్వింద్
  • సానుకూలంగా స్పందించిన మంత్రి

 

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఆయన కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశాను. ఈ సందర్భంగా గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మాధవ్ నగర్, అర్సపల్లి, అడవి మామిడిపల్లి ఆర్వోబీలకు సంబంధించి సుమారు రూ.13.5 కోట్ల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. మంత్రి భట్టి సానుకూలంగా స్పందించి, పెండింగ్ బిల్లులను సత్వరమే విడుదలయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలియజేశారు.

More articles

Latest article