నిజామాబాద్ , బతుకమ్మ:
మాదిగ ఉద్యోగుల సమాఖ్య నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం గా జరిగింది. మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశం శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరిగింది. ఈ సమావేశానికి ఎంఇఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చేపర్తి యాదగిరి మాదిగ ముఖ్య అతిథిగా , విశిష్ట అతిథిగా ఎం ఈ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు సిలుమాల సురేష్, జాతీయ కోర్ కమిటీ సభ్యులు రేణిగుంట నాంపల్లి, తెడ్డు గంగారం లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య నిజామాబాద్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షులు గా సైదు లక్ష్మణ్ , ప్రధాన కార్యదర్శి గా జి. సాయిలు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్. మారుతి, కోశాధికారి: బి. సహదేవ్ ను,అడిషనల్ జనరల్ సెక్రటరీ నాగనాథ్ ను ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన జిల్లా కార్యవర్గానికి రాష్ట్ర అధ్యక్షుడు నియామక పత్రాలు అందజేసి , వారిని ఘనంగా సన్మానించారు.

ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు నిరుద్యోగులకు అవగాహన కల్పించాలి…..
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా లభించే ఫలాలు మాదిగ, మాదిగ ఉపకులాల విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తూ, ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని ఎంఇఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చేపర్తి యాదగిరి పిలుపు నిచ్చారు. భారత సమాజంలో కుల, మత, లింగ వివక్షతకు తావులేని సమానత్వ సమాజ నిర్మాణమే లక్ష్యంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఆయన భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా సమసమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ఉద్యమాలు నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు వంటి అంశాలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయడంలో ఉన్న అడ్డంకులను తొలగించి, వారికి న్యాయం చేయాలని కోరారు. సమానత్వ సమాజ నిర్మాణమే లక్ష్యం ఉద్యోగుల హక్కుల సాధనే ధ్యేయం కావాలని అన్నారు.ఈ సమావేశంలో బాలచందర్, భూమన్న, గణేష్, ప్రవీణ్, గంగాధర్, శ్రీనివాస్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
