26.2 C
Hyderabad
Monday, August 3, 2026

మున్సిపల్ కమిషనర్ ను కలిసిన సాయి టవర్స్ వాసులు

Must read

📰 Generate e-Paper Clip

  • కాలనీ సమస్యల పై వినతి పత్రం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని.. మూడో డివిజన్ మహాలక్ష్మి నగర్ సాయి టవర్స్ కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ను కలిశారు. కాలనీ లో రోడ్డు, డ్రైనేజీ, మంచి నీటి సమస్య పై వినతి పత్రం అందచేశారు. సమస్యల పై కమిషనర్ సానుకూలంగా స్పందించారు. సాయి టవర్స్ కాలనీ సందర్శించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తాగు నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీధి లైట్ల సాధ్యమైనంత తొందరగా ఏర్పాటు చేయిస్తామన్నారు. కమిషనర్ ను కలిసిన వారిలో సాయి టవర్స్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు మహేష్ , ప్రధాన కార్యదర్శి బాల్ రావు, సభ్యుడు బాల కుమార్ కలిశారు.

More articles

Latest article