. . . ఇంచార్జీ ని నియమించినప్పటికి రుద్రూర్లో ప్రత్యక్షం
. . . మండలంలో రోడ్డుపై సిబ్బందితో తహసీల్దార్ హల్చల్…
. . . నిబంధనల ఉల్లంఘనపై చర్చ…
రుద్రూర్, బతుకమ్మ :
జిల్లా కలెక్టర్ నుంచి సస్పెన్షన్ ఆర్డర్ అందుకున్నా రుద్రూర్ మండల తహసీల్దార్ బి.తారాబాయి తీరు మారలేదు. నిజామాబాద్ హెడ్ క్వార్టర్స్ గా నిర్ణయించి, కలెక్టర్ అనుమతి లేకుండా బయటకు వెళ్లొద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, బుధవారం తహసీల్దార్ బహిరంగంగా వీధుల్లోకి రావడం స్థానికంగా చర్చ జరుగుతోంది. సర్ విధుల్లో అలసత్వం, 07.10.2026 నుండి అనాధికార గైర్హాజరు కారణంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆమెను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ మేరకు ప్రోసిడింగ్ నెంబర్ ఎ3 /1400 /2026 ను ఈ నెల 12 ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎఫ్ఆర్ 53 ప్రకారం జీవనభృతి మాత్రమే ఇస్తూ, విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఆర్డర్ లో పేర్కొన్నారు. కలెక్టర్ ఆర్డర్ ప్రకారం సస్పెన్షన్ లో ఉన్న అధికారి ఎలాంటి అధికారిక విధులు నిర్వహించరాదు. హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదు. అయినప్పటికీ తహసీల్దార్ తారాబాయి బహిరంగంగా కనిపించడంపై రెవెన్యూ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సస్పెన్షన్ లో ఉన్న తహసీల్ధార్ మండలంలో రోడ్డు పై పనులు పరి శీలించడం దానికి రెవిన్యూ ఉద్యోగులు ఉండటం చర్చ జరుగుతుంది. తాను సెలవులో ఉన్నానని దానిన పొడిగించుకున్నట్టు రెవిన్యూ శాఖలో తారాబాయి ఉధంతం పై తోటి అధికారులు చెబుతున్నారు. కాని ఏకంగా ఇంచార్జీ తహసీల్థార్ ఉన్నప్పటికి, వేటు పడిన అధికారిణి ఎలా విధులకు హజరు అయ్యారు, అధికారులే పనులకు పురమాయించారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వేళ అధికారుల అనుమతి లేకుండా మండలంలో తారాబాయి అధికారికంగా విధులకు హజరయితే ఇది కలెక్టర్ ఉత్తర్వులను ధిక్కరించడమే అవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. దీని పై కలెక్టరేట్ నుండి మరో చర్య ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

