28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్ యుబి క్రింద వర్షపు నీటిలో నిలిచిన ఆర్టిసి బస్సు

Must read

📰 Generate e-Paper Clip

. . . ఆర్ యుబి వద్ధ ఘటన

. . .  ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసిన పోలిస్ లు

. . . సోషల్ మీడియాలో గిరికిలు కోట్టిన విడియోలు

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం :

నిజామాబాద్ నగరంలో  ఓక ఆర్టిసి బస్సు వర్షపు నీటిలో చిక్కి నిలిచిపోయింది. ఈ సంఘటన సోమవారం మద్య హ్నం రైల్వే కమాన్ వద్ధ గల ఆర్ యుబి వద్ధ జరిగింది. నిజామాబాద్ నగరంలో సోమవారం మద్యహ్నం కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. ఎగువ బాగంలోని వర్షపు నీరు రావడంతో రైల్వే అండర్ బ్రిడ్జీ వద్ధ బారి స్థాయిలో వర్షపు నీరు నిలిచింది. ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న ఆర్టిసి బస్ ఆర్ యుబి కింద నడుం వరకు నిలిచిన వర్షపు నీటిలో ఆకస్మాత్తుగా నిలిచిపోయింది. అప్పుడు అందులో ఉన్న ప్రయాణికులు ఉండటంతో అప్పటికే ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్న ట్రాఫిక్ పోలిస్ లు అప్రమత్త మయ్యారు. ప్రయాణికులను స్థానికుల సహయంతో సురక్షితంగా ఓడ్డుకు చేర్చారు.

RTC standing in rainwater below RUB

 

More articles

Latest article