. . . ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె రెండో రోజు నర్సంపేట లో ఘటన
నర్సం పేట, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో బుధవారం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఈ క్రమంలో సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పని చేస్తున్న కోలా శంకర్ గౌడ్ గురువారం నర్సంపేట బస్టాండ్ ఎదురుగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. రెండు రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న శంకర గౌడ్ తాజా పరిణామాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులతో చర్చలు జరిపినప్పటికీ, తగిన స్పందన లభించలేదని ఆరోపిస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు. గాయాలపాలైన శంకర్ ను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుప్రతికి తరలించారు.
