26.3 C
Hyderabad
Monday, August 3, 2026

మద్నూర్ మార్కెట్ అభివృద్ధికి రూ.69లక్షలు మంజూరు

Must read

📰 Generate e-Paper Clip

  • మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్

 

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మార్కెట్ అభివృద్ధికి 69 లక్షలు మంజూరు అయినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్  మంగళవారం తెలిపారు. మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి జూపల్లి కృష్ణారావు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు, చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న జుక్కల్ ఎమ్మెల్యేకు సీఎంకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు  దారస్ సాయిలు, సోసైటి చైర్మన్ శ్రీనివాస్ పటేల్, సలబత్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్,  మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్,  సంతోష్ మేస్త్రి, హన్మంత్, విఠల్ గురూజీ, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.

More articles

Latest article