. . . టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేసిందని పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించడంలో ఆయన ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతుల కోసం రూ.50 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో ఆడిటోరియాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు మరింత అనుకూలంగా తీర్చిదిద్దనున్నారు.బాల్కొండ నియోజకవర్గంలోని ప్రసిద్ధ లింబాద్రి గుట్ట వద్ద టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.4 కోట్లు మంజూరు చేయించారు. దీనివల్ల ఆధ్యాత్మికపర్యాటక రంగాల అభివృద్ధికి ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఆర్మూర్‌లోని సిద్ధుల గుట్ట టూరిజం గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటకులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే తన లక్ష్యమని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి కొనసాగిస్తానని పార్టీ నేతలు స్పష్టం చేశారు.

