27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పెళ్లి రిటర్న్ గిఫ్ట్‌ గా గ్రామానికి రూ. 34.6 కోట్ల భద్రత

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

సాధారణంగా పెళ్లిళ్లకు వెళ్తే స్వీట్లు, చిన్న చిన్న గిఫ్టులు ఇవ్వడం చూస్తుంటాం. కానీ మహారాష్ట్రలోని బహదర్‌పురా గ్రామంలో జరిగిన ఈ పెళ్లి మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా చేసింది ! అసలేం జరిగిందంటే.. సిద్ధేశ్వర్ పేఠ్‌కర్ అనే వరుడి కుటుంబం తమ ఇంట్లో పెళ్లి వేడుకను కేవలం తమ సంతోషంగానే కాకుండా, ఊరంతటికీ ఒక భరోసాగా మార్చాలని డిసైడ్ అయ్యింది. షో – ఆఫ్ కోసం అనవసరపు ఖర్చులు చేయకుండా.. ఏకంగా గ్రామంలోని 3,465 మంది నివాసితులకు రూ. 34.6 కోట్ల విలువైన ప్రమాద బీమా (యాక్సిడెంటల్ ఇన్సురెన్స్) కవరేజీని రిటర్న్ గిఫ్ట్‌ గా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ! ఊళ్లో ఒక్కరు కూడా మిస్ కాకూడదని నేరుగా ఓటర్ల లిస్ట్‌ నే ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చి.. ప్రతి ఒక్కరికీ రూ. 1 లక్ష ప్రమాద బీమా అందేలా చేశారు. ఎందుకీ వినూత్న ఆలోచన? “మా ప్రాంతంలో పాముకాట్లు, పిడుగుపాట్లు, వ్యవసాయ ప్రమాదాలు ఎక్కువ. ఒక ప్రమాదం జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడుతుంది. అందుకే మా సంతోషం మా ఇంటికే పరిమితం కాకూడదు, ఊరికి రక్షణగా మారాలి” అని వరుడి కుటుంబం ఎంతో గొప్పగా చెప్పుకొచ్చింది. పైగా, దీనికోసం ఎంత ప్రీమియం కట్టారో కూడా బయటకు చెప్పకుండా, “మాకు పొగడ్తలు వద్దు, మీ ఆశీస్సులు చాలు” అంటూ తమ సంస్కారాన్ని చాటుకున్నారు. ఈ అద్భుతమైన గిఫ్ట్‌ కి ఊరు ఊరంతా కన్నీళ్లు పెట్టుకుని, ఆ కుటుంబంపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. నిజంగా ఇలాంటి ఆలోచన చేసిన ఆ వరుడి కుటుంబానికి హాట్సాఫ్ చెప్పాల్సిందే…

More articles

Latest article