పెళ్లి రిటర్న్ గిఫ్ట్‌ గా గ్రామానికి రూ. 34.6 కోట్ల భద్రత

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   సాధారణంగా పెళ్లిళ్లకు వెళ్తే స్వీట్లు, చిన్న చిన్న గిఫ్టులు ఇవ్వడం చూస్తుంటాం. కానీ మహారాష్ట్రలోని బహదర్‌పురా గ్రామంలో జరిగిన ఈ పెళ్లి మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా చేసింది ! అసలేం జరిగిందంటే.. సిద్ధేశ్వర్ పేఠ్‌కర్ అనే వరుడి కుటుంబం తమ ఇంట్లో పెళ్లి వేడుకను కేవలం తమ సంతోషంగానే కాకుండా, ఊరంతటికీ ఒక భరోసాగా మార్చాలని డిసైడ్ అయ్యింది. షో - ఆఫ్ కోసం అనవసరపు ఖర్చులు చేయకుండా.. ఏకంగా గ్రామంలోని 3,465 మంది నివాసితులకు...