28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రుద్రూర్ లో దొంగల బీభత్సం

Must read

📰 Generate e-Paper Clip

– మూడు చోట్ల చోరీలు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. మండల కేంద్రంలోని వైన్ షాపులో, అంగడి బజార్ లోని షేక్ వాయిద్ కు చెందిన కిరాణా దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి వైన్స్ షాపు వెనుక భాగంలో రేకును కత్తిరించి లోనికి చొరబడ్డారు. మందుబాటిల్లు, సుమారు 60 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారని వైన్ షాపు యజమాని తెలిపారు. కిరాణా షాపు వెనుక ప్రాంతంలోని గోడను పగులగొట్టి సిగరెట్ డబ్బాలు, రూ.5వేలు ఎత్తుకెళ్లారని షాపు యజమాని షేక్ వాహిద్ తెలిపారు. పోలీసులు ఘనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. పోలీసులు రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. 

More articles

Latest article