27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

24 గంటల్లో రాబరీ కేసు చేదన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ఇటీవల జరిగిన దోపిడీ కేసును పోలీసులు 24 గంటలో చేదించారు. నగర సీఐ శ్రీనివాసరాజు తెలిపిన వివరాల ప్రకారం…. నగరంలోని మూడవ టౌన్ పరిధిలో గల న్యూ ఎన్జీవోస్ కాలనీకి చెందిన చిందం సిద్ధిరాములు ( 70) అను వృద్ధుని ఇంట్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కత్తితో గాయం చేసి,తన మెడలో నుండి రెండు తులాల బంగారు చైన్ ని లాక్కొని ఒక ఆటోలో పారిపోయాడు. ఈ సంఘటన ఈనెల 16న చోటుచేసుకుంది. అతని మనవడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు . టౌన్ సిఐ జి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో మూడో టౌన్ పోలీసులు దర్యాప్తులో భాగంగా బంగారు చైన్ దొంగలించడానికి సహాయం చేసిన ఆటో డ్రైవర్ కరీం , చైన్ దొంగలించిన నజీమ్ లను అరెస్టు చేశారు .వారి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు ఒక ఆటో, ఒక కత్తి , రెండు తులాల బంగారు చైన్ ని స్వాధీనం చేసుకున్నారు . వారిని శుక్రవారం రిమాండ్ పంపించారు. ఇట్టి కేసు చేదనలో సహాయపడిన 3 టౌన్ ఎస్సై మహేష్ ,సిబ్బందిని టౌన్ సిఐ అభినందిచారు.

More articles

Latest article