27.5 C
Hyderabad
Friday, July 31, 2026

రోడ్డుకు మరమ్మతులు…

Must read

📰 Generate e-Paper Clip

  • ఎల్లారెడ్డి–బాన్సువాడ మధ్య బస్సులు ప్రారంభం

 

బాన్సువాడ, బతుకమ్మ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి నుంచి ప్రధాన పట్టణాలను కలిపే పలు మార్గాల్లో రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి నుండి బాన్సువాడ వెళ్లే మార్గంలో  సైతం రాకపోకలు నిలిచిపోయాయి.రోడ్డు ధ్వంసం కావడంతో ఆర్టీసీ బస్సులు నడవలేదు. దీంతో అధికారులు గత రెండు రోజులుగా రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎల్లారెడ్డి నుండి బాన్సువాడ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు పున ప్రారంభం అయ్యాయి.ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడ రోడ్డును బాన్సువాడ డిపో మేనేజర్ సరిత పరిశీలించారు.

More articles

Latest article