30.2 C
Hyderabad

కర్నాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీవాసుల దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : వంతెన గోడను బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో నలుగురు ఏపీవాసులు అక్కడికక్కడే  దుర్మరణం చెందారు. ఈఘటన కర్నాటక లోని అమలాపురం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  ఏపీలోని హిందూపురానికి చెందిన కొందరు బొలెరోలో కర్నాటకలోని యాద్గిర్ జిల్లా షహర్ పూర్ పట్టణ సంతలో గొర్రెలను కొనుగోలు చేయడానికి బయలుదేరారు. ఈక్రమంలో రాయ్ చూర్ జిల్లా దేవదుర్గ తాలుకా గబ్బురు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమలాపురం వద్ద వీరి వాహనం వంతెనను ఢీకొంది. ఈప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను హిందూపురానికి చెందిన నాగరాజు, సోమ, నాగభూషణ్, మురళిగా గుర్తించారు.

More articles

Latest article