. బీసీ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం
. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, బతుకమ్మ: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను అగ్రవర్ణాలను ఎక్కువ చూపి అణగారిన వర్గాలను తొక్కేందుకు ఉపయోగించుకున్నారని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ బహిష్కృత నాయకుడు తీన్మార్ మల్లన్న ఆరోపించారు. హైదరాబాద్ లో బుధవారం ఆయన తన సస్పెన్షన్ పై మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తనను చాలా రోజుల నుంచి సస్పెండ్ చేయాలని ప్రయత్నించారని, ఒకటి రెండు రోజుల్లో మల్లన్నను పార్టీ నుంచి బయటికి పంపించాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కోరారని అన్నారు. తనను బయటికి పంపించడం ద్వారా బీసీలు నోరు మూసుకుంటారనే భ్రమలో ఉండొద్దని సీఎంకు ఆయన హితవు పలికారు. తాము మలిదశ బీసీ ఉద్యమాకారులమని బీసీ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
