25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పదోన్నతులతో బాధ్యత పెరుగుతుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రెట్టింపు ఉత్సాహంతో సేవలు అందించాలి

 

. . . స్వయంగా పదోన్నతి పట్టీలను అలంకరించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

పోలీసు శాఖలో క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బందికి పదోన్నతులు లభించాయి. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించడం పోలీసు శాఖలో ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కానిస్టేబుల్ స్థాయి నుండి హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన వారిలో దోమకొండ పోలీస్ స్టేషన్కు చెందిన సిహెచ్. రజినీకాంత్, సదాశివనగర్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్. మురళి మోహన్, దేవునిపల్లి పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్. శ్రీనివాస్, నసురులాబాద్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎన్. హరిచంద్ర, బీర్కూర్ పోలీస్ స్టేషన్కు చెందిన హెచ్. కిషన్, సీసీఎస్ పోలీస్ స్టేషన్కు చెందిన జే. గణపతి, మైసయ్య, బిచ్కుంద పోలీస్ స్టేషన్కు చెందిన కే. జీవన్ ఉన్నారు. అలాగే కామారెడ్డి పోలీస్ స్టేషన్కు చెందిన కె. ఎల్లారెడ్డి హెడ్ కానిస్టేబుల్ నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స పెక్టర్ గా పదోన్నతి పొందారు. ఈ పదోన్నతి వారి సుదీర్ఘ సేవలకు, నిరంతర శ్రమకు దక్కిన గుర్తింపుగా జిల్లా ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. సిబ్బంది అందరూ ఇదే స్ఫూర్తితో తమ విధులను నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు సమర్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ వారికి కొత్త హోదా చిహ్నాలను స్వయంగా అలంకరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ పదోన్నతులు కేవలం హోదాను మాత్రమే పెంచవని, బాధ్యతలను కూడా రెట్టింపు చేస్తాయన్నారు. మీరు ఇప్పటివరకు చూపిన ప్రతిభ, అంకితభావం భవిష్యత్తులోనూ కొనసాగించి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణే మన ప్రధాన ధ్యేయమని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని దిశానిర్దేశం చేశారు.

 

Responsibility increases with promotion.

More articles

Latest article