29 C
Hyderabad
Monday, August 3, 2026

బిసిలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  బిసిలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు డిమాండ్ చేశారు. బిసి ఇంటలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర చైర్మన్ టి. చిరంజీవులు ను బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో వారి స్వగృహం హైదరాబాద్ లో కలిసి శాలువ పూల బొకే తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ బిసి లకు విద్యా ఉద్యోగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతనే ఎన్నికలకు వెళ్లాలన్నారు. బిసి లకు క్రీమిలేయర్ విధానాన్ని తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు ఉట్నూర్ సుభాష్, పల్లికొండ అన్నయ్య, వేణుగోపాల్, పాక శంకర్, మేకల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Reservations should be implemented for BCs in proportion to population

More articles

Latest article