నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 1వ డివిజన్ లోని కాలూరు జడ్పీహెచ్ఎస్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారని, ఈ కబ్జాల నుంచి స్కూల్ స్థలాన్ని కాపాడాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు గురువారం వినతి పత్రం అందజేశారు. సుమారు 20గజాల స్కూల్ స్థలాన్ని కబ్జా చేసి ముస్కె సంతోష్ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడని తెలిపారు. వెంటనే ఆ పనులు ఆపివేయించి స్కూల్ స్థలాన్ని కాపాడాలని మున్సిపల్ కమిషనర్నుకోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, నవీన్, వినోద్, స్రుజన్ పాల్గొన్నారు.