భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణంకు గాను ఖాళీ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ గురువారం తహసీల్దార్ షబ్బీర్ కు వినతి పత్రాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ నాయకులు అందజేశారు. వినతిని స్వీకరించిన తహసీల్దార్ స్పందించి వినతిని ఆర్డీఓ కు సిఫారస్ చేస్తామని తెలిపారు. ఈ వినతిని అందించిన వారిలో అక్రిడేషన్ యూనియన్ ప్రెసిడెంట్ వార్త రాజు, వైస్ ప్రెసిడెంట్ ఉడుత మహేష్, సెక్రటరీ గంట భాగేష్, క్యాషియర్ గొల్లపల్లి మురళి, సభ్యులు మంద గోవర్ధన్, రావుట్ల సతీష్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ తుమ్మ రవీందర్, సయ్యద్ అత్తరుద్దీన్ లు పాల్గొన్నారు.
