29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

దెబ్బతిన్న పోచారం ప్రాజెక్ట్ ఆనకట్టకు మరమ్మతులు

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : గత రెండు రోజులు కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న పోచారం ప్రాజెక్టు ఆనకట్టకు అధికారులు మరమ్మతుల పనులు చేపట్టారు. 1922 సంవత్సరంలో 1.82 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో  తో నిర్మితమైన పోచారం ప్రాజెక్టు నుండి అత్యధికంగా 70 వేల క్యూసెక్కుల నీటిని  కిందికి వదిలే అవకాశం ఉంది.  గత రెండు రోజులుగా కురుస్తున్నది భారీ వర్షం మూలంగా 182000క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్ నుంచి దిగువకు వెళ్లడంతో దెబ్బతిన్న ప్రాజెక్ట్ ఆనకట్టకు మరమ్మత్తులు నిర్వహించబడుతున్నాయి. ఈ ఆనకట్ట మరమ్మత్తు పనులను ఎల్లారెడ్డి ఆర్డీవో, ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Repairs to damaged Pocharam project dam

More articles

Latest article