25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కారు తీసేసారోచ్ .. 

Must read

📰 Generate e-Paper Clip

  •  పరిషత్ నుంచి తొలగిన దిష్టి బొమ్మ 
  • బతుకమ్మ వార్తకు స్పందన 

జిల్లా పరిషత్, బతుకమ్మ:  జిల్లా పరిషత్ లోని విశ్రాంతి భవనం కారిడార్ లో ఉన్న కారును తీసివేసారు. జడ్పి ఉద్యోగి గత కొంత కాలంగా తన  కారును ఇదే స్థలంలో పార్కింగ్ చేస్తున్నాడు. భవనం ఉపయోగంలో లేనప్పుడు వాడుకుంటే పోనిలే అనుకోవచ్చు. మండల పరిషత్ కార్యాలయం వచ్చినగాని తన కారును అక్కడి నుంచి తీయలేకపోయాడు. ఇదే విషయాన్నిప్రస్తావిస్తూ డిసెంబర్ 31న “కారు పార్కింగ్ కోసమేనా ఆ కారిడార్” అనే కథనాన్ని బతుకమ్మలో ప్రచురించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తన కారును చీకటి పడిన తర్వాత తన ఇంటికి తీసుకెల్లినట్లు తెలిసింది. దీంతో మండల పరిషత్ ఉద్యోగులతో పాటు జడ్పి సిబ్బంది హర్షం వ్యక్తం చేస్స్తున్నారు.

More articles

Latest article