బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కురిసిన అతిభారీవర్షం కారణంగా పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ముఖ్యంగా నర్సాపూర్ ప్రాంతంలో వర్షపు నీరు ఇండ్లలోకి ప్రవేశించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోకుండా రక్షించేందుకు రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో 10 ఇళ్లపై తైవాన్ పట్టాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. రెడ్ క్రాస్ సొసైటీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు భశ్వేశ్వర్ రావు మాట్లాడుతూ, నర్సాపూర్ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకొని, పది సంవత్సరాల పాటు మన్నేలా ఉండే తైవాన్ పట్టాలను పంపిణీ చేశామని తెలిపారు.

