27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలి

Must read

📰 Generate e-Paper Clip

ఏఐఎస్ఎఫ్ నాయకులు రఘురాం

నిజామాబాద్ సిటీ బతుకమ్మ : యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు రఘురాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులు ఇంచార్జ్ వీసిలుగా వుండటంతో యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీసీలను నియమించడంలో అలసత్వం వహించకుండా రెగ్యులర్ వీసిలను నియమించాలని కోరారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ విసిలను నియమిస్తామని, యూనివర్సిటీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో మెస్ డిపాజిట్ల పద్ధతిని ఎత్తివేయాలన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి ఉచితంగా మెస్, హాస్టల్ సౌకర్యం కల్పించాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన తరగతి గదులు, హాస్టల్ నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంజలి, కుషాల్, భార్గవి పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article