యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలి

ఏఐఎస్ఎఫ్ నాయకులు రఘురాం నిజామాబాద్ సిటీ బతుకమ్మ : యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు రఘురాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులు ఇంచార్జ్ వీసిలుగా వుండటంతో యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీసీలను నియమించడంలో అలసత్వం వహించకుండా రెగ్యులర్ వీసిలను నియమించాలని కోరారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ విసిలను నియమిస్తామని, యూనివర్సిటీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో మెస్ డిపాజిట్ల...