24 C
Hyderabad
Sunday, August 2, 2026

నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తిపై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన పెరిక శ్రీనివాస్ నిబంధనలు ఉల్లంఘించాడని కేసు నమోదు చేసి బైండోవర్ చేశామని  ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ గతంలో ఒక దొంగతనంలో కేసులో ఇన్వాల్వ్ అయినందున అతనిని భిక్కనూరు ఎమ్మార్వో శివప్రసాద్ ముందు బైండోవర్ చేసామని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించినందున ఎమ్మార్వో అతనికి 15వేల రూపాయలు జరిమానా విధించారని తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్సై జగదీష్, సాయిలు, అశోక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

More articles

Latest article