రెడ్ క్రాస్ సేవలు ఆదర్శనీయం

0 2,492

నిజామాబాద్, బతుకమ్మ: రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసేమియా బాధిత చిన్నారుల వార్డును జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల బుధవారం సందర్శించారు. రెడ్ క్రాస్ సేవలు ఆదర్శనీయమని, జాతీయ స్థాయిలో జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. తలసేమియాతో బాధపడుతున్న చికిత్స పొందుతున్న చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాతల సమన్వయ కర్త నరాల సుధాకర్ ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపె రవీందర్, డాక్టర్ నీలి రాంచందర్ ,నిజామాబాద్ డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం,మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్  రాజేశ్, నాగేందర్, పీఆర్వో బొద్దుల రామకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.

Red Cross services are exemplary

Leave A Reply

Your email address will not be published.