29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజలకు సేవ చేసినప్పుడే గుర్తింపు వస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆత్మీయ అభినందన సభ లో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేంధర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజలకు సేవ చేసినప్పుడే రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేంధర్ అన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు నగర శివారులోని కమ్మ సంఘంలో శుక్రవారం ఆత్మీయ అభినందన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటల, ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు హుందాగా వ్యవహరించాలన్నారు. గెలుపు గర్వంతో ముందుకు వెళ్తే భవిష్యత్తు రాజకీయం అంధకారమవుతుందన్నారు. అలాగే రాజకీయ చరిత్రలో రైతులతో పెట్టుకున్న ఏ పార్టీ కూడీ బ్రతికి బట్ట కట్టలేదని, గెలుపు గర్వంతో కాకుండా ప్రజా సేవకే అంకితమవ్వాలని అన్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ విర్రవీగిన తనంతో ముందుకు వెళ్లిందన్నారు. ప్రజలు, రైతులను పట్టించుకోకుండా అహంకారపూరిత పాలన చేసిందన్నారు. తాను అసెంబ్లీలో బడ్డెట్ ప్రవేశ పెట్టిన సమయంలో ప్రతి పక్షంలో ఉన్న డీఎస్ మాట్లాడుతూ ఒకప్పుడు తన రాజకీయ గురువైన అర్గుల రాజారాం ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ఈటెల బడ్జెట్ పోలి ఉందని కితాబునిచ్చారన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పటికీ డీఎస్ హుందాతనం ప్రదర్శించేవారన్నారు. ప్రతి పక్షం అంటేనే విమర్శించడం కాదని, అధికార పక్షం అంటే అధికారం మాత్రమే చూపడం మాత్రమే కాదన్నారు.

 

Recognition comes only when you serve the people.

 

అనంతరం ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ హుందా రాజకీయాలు ఇందూర్ పార్లమెంట్ను చూసి నేర్చుకోవాలని అన్నారు. తెలంగాణ మొత్తంలో నిజామాబాద్ లోనే అత్యధిక కార్పొరేటర్ కౌన్సిలర్ సీట్లు బీజేపీ గెలిచిందని స్పష్టం చేశారు. తాము ఎవరిని కొనుక్కొని రాజకీయాలు చేయమన్నారు. హిందువులలో అత్యధిక కార్పొరేటర్ సీట్లను తాము గెలిచామని, మిగిలిన వాటిని కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కై మేయర్ సీటును కైవసం చేసుకుందన్నారు. అంతే కానీ ప్రజల ఆశీర్వాదంతో మేయర్ సీటును అందుకోలేదన్నారు. తాము ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు సాగుతున్నామన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో కూడా రోజులను తగ్గించడం, ప్రశ్నించే వారిని అణగదొక్కడం చేసిందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో నూ బీజేపీ తన సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోనే ఇందూర్ పార్లమెంటు పరిధిలో అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపిస్తానని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా హుందాగా ఉండే నాయకుల్లో ఎంపీ ఈటల రాజేందర్ ఒకడని కొనియాడారు.

 

Recognition comes only when you serve the people.

 

అనంతరం నిజామాబాద్ అర్మన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ మాట్లాడుతూ గెలుపొందిన కార్పొరేటర్లు కౌన్సిలర్లు ప్రజలతో మమేకం అవ్వాలని అన్నారు. నిత్యం అభివ్రద్ది కోసం ఆలోచన చేయాలని దీంతో ప్రజల చేయూత ఎప్పటికీ ఉంటుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ ఇటీవల ఎంపీ అర్వింద్ భవిష్యత్తులో మేయర్ పీఠాన్ని తాము కైవసం చేసుకుంటామని చెప్పారని గుర్తు చేశారు. ఎంపీ ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా చేసి తీరుతారని దానికి ఒక అర్ధం ఉంటుందని తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజీపీని గెలిపించుకుని జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకుంటామన్నారు. మరో ఎక్స్ అఫీషియో ఓటు బీజేపీకి వస్తుందని అలాగే మరో ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీ అవుతుందని అది కూడా బీజేపీ కైవసం చేసుకుంటుదన్నారు. అనంతరం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గెలుపొందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, జిల్లా ప్రబారి కాంతారావు, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్యవర్గ సభ్యులు భోగ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

 

Recognition comes only when you serve the people.

 

More articles

Latest article