27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్యాడీ ప్రొక్యూర్ మెంట్ సెంటర్ ను పరిశీలించిన ఆర్డీవో

Must read

📰 Generate e-Paper Clip

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామంలోని ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ సెంటర్ ను ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సెంటర్ నిర్వహణపై సమీక్ష నిర్వహించి, సెంటర్ ఇన్‌చార్జ్‌ కు పలు సూచనలు చేశారు. రైతుల నుంచి సేకరించిన వరిని ఆలస్యం చేయకుండా త్వరితగతిన తూకం చేయాలని ఆదేశించారు. అలాగే రవాణా లేదా ఇతర ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ నెలాఖరు లోపు సెంటర్‌లోని అన్ని కొనుగోలు ప్రక్రియలను పూర్తి చేయాలని ఆర్డీవో స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RDO inspects paddy procurement center

More articles

Latest article