28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా ఆర్ బీ వీ ఆర్ ఆర్ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నగర శివారులోని ఆర్ బీ వీ ఆర్ ఆర్ పాఠశాలలో రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి హాజరయ్యారు. రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఆడపిల్లల చదువు, సమాజహితం కోసం రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యా సంస్థ చైర్మన్ జగత్ రెడ్డి, ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి, సెక్రెటరీ గోవర్ధన్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ సుజిత్ రెడ్డి, ఆలంబన వృద్ధాశ్రమ చైర్మన్  రుక్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ ఆగ్రహం

తమ డివిజన్ పరిధిలో ఉన్న పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆహావనించకపోవడంపై స్థానిక కార్పొరేటర్ మరాటి యమున ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ ను కావడంతోనే తనను ఆహ్వానించకుండా అవమానిస్తున్నారని అన్నారు. ఇది వారి అహంకారానికి నిదర్శనమన్నారు.

 

 

More articles

Latest article