ఘనంగా ఆర్ బీ వీ ఆర్ ఆర్ జయంతి
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నగర శివారులోని ఆర్ బీ వీ ఆర్ ఆర్ పాఠశాలలో రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఏసీపీ రాజావెంకటరెడ్డి హాజరయ్యారు. రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఆడపిల్లల చదువు, సమాజహితం కోసం రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యా సంస్థ చైర్మన్ జగత్ రెడ్డి, ప్రెసిడెంట్...