. . . రథయాత్రను ప్రారంభించిన జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఖుష్బు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జిల్లా న్యాయసేవ అధికార సంస్థ నిజామాబాద్ అధ్వర్యంలో సాధన సంస్థ ఎన్జీవోద్వారా బాల్య వివాహాల నివారణ, వాటి చట్టాలను పై అవగాహన కల్పించేందుకు రథయాత్రను ఏర్పాటు చేయగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఖుష్బు ప్రారంభించారు. మంగళవారం కోర్టు ఆవరణలో జండా ఊపి మేజిస్ట్రేట్ ప్రారంభించారు. ఈ రథయాత్ర నిజామాబాద్ జిల్లాలో నెల రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూఓ పద్మ, డీసీపీవో చైతన్య, సాధన సిబ్బంది మధుసుదన్, వినీష్, నిరీక్షణ తదితరులు పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, జిల్లా న్యాయసేవాధికారి సంస్థ సూపరింటెండెంట్ సిబ్బంది పాల్గొన్నారు.
