27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అన్నదమ్ములపై హత్యాయత్నం

Must read

📰 Generate e-Paper Clip

. ముగ్గురిపై కత్తితో దాడి

మాక్లూర్, బతుకమ్మ: మాక్లూర్ మండలం అమ్రద్ తండా లో ఓ వ్యక్తి ముగ్గురు అన్నాదమ్ముళ్లపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జ్యోతిరామ్ అనే వ్యక్తి భార్య గ్రామంలో రేషన్ డీలర్. అయితే తమకు బియ్యం పోయడం లేదంటూ అన్నాదమ్ముళ్లు విక్రమ్, పీర్ సింగ్ గొడవపడ్డారు. అక్కడే ఉన్న జ్యోతిరామ్ తోపాటు ఆయన సోదరులు శ్రీనివాస్, రాజునాయక్ అడ్డుకోగా, ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లి కత్తి తీసకువచ్చిన విక్రమ్, పీర్ సింగ్ ముగ్గురు సోదరులపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన జ్యోతిరామ్ తోపాటు ఆయన సోదరులు శ్రీనివాస్, రాజునాయక్ కు చికిత్స నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Attempted murder of siblings

Attempted murder of siblings

More articles

Latest article