25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

జోరుగా అక్రమ నిర్మాణాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు

 

. . . ఉన్నోడికి ఒక న్యాయం.. పేదవాడికి ఒక న్యాయమా ?

 

పిట్లం, బతుకమ్మ :

 

పిట్లం మండల కేంద్రంలో రోజురోజుకూ రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా తయారైంది. ప్రశ్నించే వారు ఉంటే తప్ప అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు మండలంలో అనేకంగా ఉన్నాయి. మండల కేంద్రంలో ఒక ప్రముఖ వ్యాపారి నిర్మిస్తున్న భవనం పై విమర్శలు వుండడంతో నిర్మాణాన్ని నిలిపివేశారు. అలా జరగకుండా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అపసవ్యంగా వుంటున్నా వారికి పంచాయతివారు నిబంధనలు పనిచేయడం లేదు. గృహ నిర్మాణ అనుమతులు పొందిన వారు గ్రౌండ్ పోరులో కమర్షియల్ నిర్మాణాలు చేపట్టిన గ్రామపంచాయతీ వారు  చర్యలు చేపట్టారని మండలంలో అనేకమైన విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా    ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article