28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రంజాన్ ఏర్పాట్లపై సమీక్షించాలి

Must read

📰 Generate e-Paper Clip

. కలెక్టర్ హనుమంతుకు వినతిపత్రం అందజేసి ఎంఐఎం నాయకులు

. రేపటి లోగా సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: రంజాన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్షించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని ఎంఐఎం నాయకులు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కోరారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ హైమద్, నగర అధ్యక్షుడు మహ్మద్ షకీల్ హైమద్ తదితరులు సోమవారం  కలెక్టర్ ను కలిశారు. ఇతర జిల్లాల కలెక్టర్లు రంజాన్ ఏర్పాట్లపై సమీక్షాసమావేశాలు ఏర్పాటు చేశారని, మన జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని కోరారు. నీరు, విద్యత్ సరఫరా, ట్రాఫిక్, పోలీస్ బందోబస్తు, మసీదు, ఈద్గా ల్లో పనులు తదితర వాటిపై సమీక్షించాలని కోరారు. స్పందించిన కలెక్టర్ రేపటిలోగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రంజాన్ ఏర్పాట్లపై అధికారులతో ఎంఐఎం నాయకులు చర్చించడంపై ముస్లిములు హర్షం వ్యక్తం చేశారు. 

More articles

Latest article