29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : డిసెంబర్ 1 నుండి 9 వ తేది వరకు జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 1 నుండి 9 వరకు జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు అన్ని శాఖల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. శాఖల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాఖాపరంగా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టిన కార్యక్రమాల విజయగాధాలను తెలిపే విధంగా ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, జిల్లా అటవీ అధికారిణి నిఖిత, జడ్పీ సీఈవో చందర్ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Public administration public victory celebrations should be held grandly

More articles

Latest article