మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు శుభ దినమని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ అన్నారు. పేదరికం చదువుకు అడ్డు కాదని తన మానవతను చాటిన మాధవుడు హాలియా నల్గొండ వాస్తవ్యులు వజ్ర తేజ రైస్ ఇండస్ట్రీస్ అధినేత చట్టి పోలు యాదగిరి బుధవారం 110 మంది పాఠశాల విద్యార్థులకు సుమారు రూ.40,000 విలువగల బూట్లను విద్యార్థులకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులకు బూట్లు అందించినందుకు పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

