బతుకమ్మ, మోర్తాడ్: తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ తల్లి విగ్రహాల పేరుతో ముఖ్యమంత్రి ,కాంగ్రెస్ పార్టీ మూర్ఖులు చేసిన అపచారానికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చరిత్ర తెలవదని తెలంగాణ తల్లిని వేడుకుంటు మోర్తాడ్ మండల కేంద్రంలో ఉన్న నిజమైన తెలంగాణ తల్లి విగ్రహానికి మోర్తాడ్, వేల్పూర్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు మంగళవారం పాలాభిషేకం చేసి నినాదాలు చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైన రేవంత్ రెడ్డి సర్కారు ఇంతకు ముందు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని యధావిధిగా ఉంచి కొత్త గా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తొలగించాలని ముఖ్యమంత్రిని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్, వేల్పూర్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
