28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రేపు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు

Must read

📰 Generate e-Paper Clip

  • బీఆర్ఏస్ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి

బతుకమ్మ, నిజామాబాద్ : రుణమాఫీకి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణాన్ని మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారత రాష్ట్ర సమితి తరఫున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి  తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో రైతన్నలు హాజరవ్వాలని కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవటంతో ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే… మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తికాలేదని… కార్యక్రమం కొనసాగుతుందని చెబుతున్నారన్నారు. ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతన్నలను ఆయోమయానికి, ఆవేదనకు గురి చేయటమేమిటనీ ప్రశ్నించారు.

More articles

Latest article