డిఇఓ వైఖరిపై ఈ నెల 14న  ఉపాధ్యాయ సంఘాల నిరసన

0 1,286

డిఇఓ వైఖరిపై ఈ నెల 14న  ఉపాధ్యాయ సంఘాల నిరసన

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ :                                                                                                                                      

ఉపాధ్యయ సంఘాల నేతలపై జిల్లా విద్యాశాఖాధికారి తీరుపై జిల్లా ఉపాధ్యాయ  సంఘాల నేతలు ఈ నెల 14 న నిరసనకు పిలుపునిచ్చారు. ఈ మెరకు ఉపాధ్యా యసంఘాల నేతలు యం.బాలయ్య ( డిటిఎఫ్), జి. సుధాం( ఎస్ సి, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం), యండి. జమీల్ ( రాష్ర్టీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ) లు సంయుక్త ప్రకటన విడుధల చేశారు.షెడ్యూల్ తెగ ఉపాధ్యాయుని దీర్ఘకాలిక పెండింగ్ సమస్య పరిష్కారం కొరకు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గ ప్రసాద్ ని ఈనెల 8న కలిసి సమస్యపై చర్చిస్తున్న సందర్భంగా సమాధానం చెప్పలేని డిఇఓ ఉపాధ్యాయ సంఘ నాయకులపట్ల అసహనంగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ను పిలిపించి న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా తప్పుల్ని ప్రశ్నించే హక్కుని అడ్డుకోవడమే అవుతుంది. కావున డిఇఓ అనుచిత వైఖరిని నిరసిస్తూ సోమవారం ఉదయం నూతన కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ సంఘాల పక్షాన నిరసన ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందని కావున అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా  పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.