స్టేషన్ ఘనపూర్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన తెగ తగిలింది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం పాల్గొన్నారు. నిరుపేదలయిన తమకు కాకుండా లక్షలకు లక్షలు ఆస్తులున్న వారికే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని శివునిపల్లి గ్రామానికి చెందిన పుంజూరి రజిత – నాగరాజు దంపతులు ఫ్లెక్సీతో నిరసన తెలిపారు. తమకు ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యేకు బాధితులు దండం పెట్టి వేడుకున్నారు. బాధితులను అడ్డుకుని ఫ్లెక్సీని లాగేసి పోలీసులు ఈడ్చుకెళ్లారు.
