31.7 C
Hyderabad

గల్లంతైన యువకుల మృతదేహాలను వెలికి తీత

Must read

📰 Generate e-Paper Clip

నిజాంసాగర్,బతుకమ్మ : నిజాంసాగర్ మండలం హసన్​పల్లి గ్రామ శివారులోని పిప్పి రేగడి సమీపంలో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ముగ్గురు యువకులు సోమవారం గల్లంతైన విషయం తెలిసిందే. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మంగళవారం గల్లంతైన ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు. మృతులను ఎల్లారెడ్డి మండలం సోమారంపేట గ్రామానికి చెందిన  బెస్త హర్షవర్ధన్ (17), నవీన్ (25), మధుకర్ గౌడ్ (17) లుగా గుర్తించారు. దీంతో సోమారంపేటలో విషాదం నెలకొంది.

More articles

Latest article