28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రభుత్వ భూమిని కాపాడండి

Must read

📰 Generate e-Paper Clip

  • న్యాయం చేయాలంటూ కలెక్టరేట్ కు తరలివచ్చిన గ్రామస్తులు

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నవీపేట మండలం యంచ గ్రామ శివారులోని సర్వే నంబర్240, 271,271 లో గల నిజమైన పట్టాదారుల యొక్క పట్టాలను కొందరు అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని యాంచా గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అబద్ధపు పట్టాలను సృష్టించి స్థానిక ఎమ్మార్వో తో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. కానీ నిజమైన పట్టాదారుల భూములను ప్రభుత్వ భూములను అదేవిధంగా మిషన్ భగీరథ భూములను కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులు తమ విషయంలో జోక్యం కల్పించుకుని తమకు న్యాయం చేయవలసిందిగా వారు డిమాండ్ చేశారు.

More articles

Latest article