- ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ
బతుకమ్మ, బిచ్కుంద : అవయవలోపాలతో ఎలాంటి పనులు చేసుకోలేకున్నవారికి, కన్న తల్లిదండ్రులకు, తోడబుట్టిన వారికి, జీవితభాగస్వాములైనవారికి,ఇటుకుటుంబంలో,అటు సమాజంలో వివక్షతకు గురి అవుతున్నవికలాంగులకు ఇచ్చిన హామీలునెరవేర్చకపోవడం బాధాకరం విషాదకరం అని తెలిపారు.అధికారం లోకి వచ్చిన వెంటనే వికలాంగుల పెన్షన్ 6 వేలు,ఇతర చేయూత పెన్షన్ దారుల పెన్షన్ 4 వేలు పెంచుతామని హామీ ఇచ్చి అధికారం లోకి వచ్చి 18 నెలలు గడిచినా ఇచ్చిన హామీని అమలు చేయకుండా, పెంచిన పెన్షన్ లను ఇవ్వకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని ఇక ప్రజల్లో ఎండగడుతామని పెన్షన్ దారుల అందరికీ అండగా నిలబడుతామని తెలిపారు. బిచ్కుంద మండల కేంద్రం లో ఎమ్మార్పీఎస్, మరియు వికలాంగుల చేయూత పెన్షన్ దారుల సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ, నాయకులు గోనె సురేష్ మాదిగ దర్శన్, గంగాధర్,మేతిరి లక్ష్మన్ గోనే సాయిలు,మల్లుగాని సాయిలు, మహేష్ గోనె శివ వినోద్ ఆకాశ్, గోనె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
