కామారెడ్డి, బతుకమ్మ : వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాల వలన వరదలు సంభవించినపుడు వెంటనే సహాయ పునరావాస కార్యక్రమాలు నిర్వహించాలని రాజస్వ మండలాధికారిని వీణ అన్నారు. మంగళవారం పట్టణంలోని గురు రాఘవేంద్ర కాలనీలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందం వారిచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గత సంవత్సరం అధిక వర్షాల వలన గురు రాఘవేంద్ర కాలనీ వాసులు ఇబ్బందులకు గురైన కారణంగా ఈ సంవత్సరం కాలనీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అవగాహన కార్యక్రమాలను స్థానిక ప్రజలకు వివరించారని తెలిపారు. వరదలు సంభవించినపుడు ఆయా ప్రజలను ముందస్తు చర్యలతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ అధికారి సుధాకర్, తహసీల్దార్ జనార్ధన్, మున్సిపల్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్, ఫైర్, ఇరిగేషన్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.

