29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

అకాల వర్షాల నేపథ్యంలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలోని డివిజన్‌ల వారీగా వరి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, పిట్లం, నిజాంసాగర్, జుక్కల్ మండలాల్లో వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. అకాల వర్షాల దృష్ట్యా పీపీసీల నుండి వరిని వెంటనే తరలించాలని, తార్పాలిన్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆర్డీఓ బాన్సువాడ, సంబంధిత ఎంపీడీఓలు, సివిల్ సప్లై అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి, గాంధారి, లింగంపేట్, తాడ్వాయి, సదాశివనగర్, నాగిరెడ్డిపేట మండలాల్లో వరి నిల్వలు తడవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, వరిని సురక్షితంగా నిల్వ చేయాలని సూచించారు. జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రైతుల ప్రయోజనాలను కాపాడేలా సంబంధిత అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

More articles

Latest article