ప్రజా సంఘాల నాయకుల ముందస్తు అరెస్ట్

0 2,084

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలో ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేయడాన్ని ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కట్టారి రాములు శుక్రవారం తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిన విధంగా రూ.12,000 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం చలో హైదరాబాద్ పేరిట ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. ఈధర్నా కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి చేసిన అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. లేనిచో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.