హైదరాబాద్, బతుకమ్మ : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ అధికారుల ఎదుట శుక్రవారం ఉదయం 10.30కి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు. ఈమేరకు ఆయన్ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, విచారణ సందర్భంగా ప్రభాకర్ రావును వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణకు కోర్టు అనుమతించింది. ఆయన్ను ఫిజికల్ టార్చర్ చేయకూడదని దర్యాప్తు బందానికి సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రత్యేకంగా సూచించిన విషయం తెలిసింది.
