- సిరికొండ ఎస్సైని ధర్పల్లికి
నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో ఎస్ హెచ్ ఓ పోస్ట్ మారడం చర్చనీయాoశంగా మారింది.. సిరికొండ ఎస్సైగా మామిడిపల్లి కళ్యాణి ని ఆదివారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కడ పనిచేస్తున్న రామును విఆర్ కు బదిలీ చేస్తూ, ఇటీవల కాలంలో ఎస్సైగా నియమితులై పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణిని అక్కడ ఎస్హెచ్ఓ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కమిషనర్ పరిధిలో 14 మంది ఎస్ఐల బదిలీలు పోస్టింగ్లు ఇస్తూ ఆదివారం కమీషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. అందులో అప్పటి వరకు పనిచేస్తున్న ఏడుగురికి విఆర్ కు బదిలీ చేస్తూ కొత్తవారికి పోస్టింగ్ ఇచ్చారు. కానీ సోమవారం ధర్పల్లి ఎస్ హెచ్ ఓ గా ఉన్న రామ కృష్ణను సిరికొండకు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రాబల్య ప్రాంతంలో కొత్తగా పోస్టింగ్ లో చేరిన ఎస్సైకి ఇవ్వడం పై అధికారులు వెనక్కి తగ్గినట్టు తెలిసింది. ధర్పల్లి ఎస్ హెచ్ ఓ గా పనిచేస్తున్న రామకృష్ణ పోలీస్ శాఖలో సీనియర్ గా ఉండడంతో నిజామాబాద్ సబ్ డివిజన్ కావడంతోని ఆయనకు పోస్టింగ్ ఇచ్చారని చర్చ జరుగుతుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరిగిన బదిలీల్లో నలుగురు మహిళ ఎస్సైలకు పోస్టింగ్లు ఇవ్వగా రాత్రికి రాత్రి ఒక ఎస్హెచ్ఓ పోస్టింగ్ తారుమారు కావడం కలకలం వేపుతుంది. సీనియార్టీ ప్రాతిపదికగా పోస్టింగ్ మార్చారా లేక రాజకీయ ఒత్తిళ్లతో రాత్రికి రాత్రే బదిలీలు జరిగాయని చర్చ జరుగుతుంది.


